- తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) ప్రాంతంలోని పలు దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ ఉన్న తెలంగాణ పౌరుల భద్రతను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఉన్నతాధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మరియు సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులు మరియు రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మధ్యప్రాచ్య పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పౌరులకు అన్ని విధాల అండగా ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈ క్రింది అధికారులను సంప్రదించవచ్చని
తెలంగాణ ప్రభుత్వ పౌర సంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది.
సంప్రదించాల్సిన 24×7 కంట్రోల్ రూమ్ నంబర్లు:
శ్రీమతి వందన బరువా
పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్
+91 9871999044
శ్రీ సీహెచ్. చక్రవర్తి
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
+91 9958322143
శ్రీ జావేద్ హుస్సేన్
లైజన్ ఆఫీసర్
9910014749
శ్రీ రక్షిత్ నాయక్
లైజన్ ఆఫీసర్
+91 9643723157
