- కారంపొడి, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో అస్వస్థతకు గురైన గోగుల ప్రభాకర్ రెడ్డి భార్య సృజన…
- సీసీ కెమెరాలు, పూల కుండీలను ధ్వసం చేసిన గూండాలు…
- దాడిలో పాల్పడింది డాక్టర్ల బృందం
ఇంటి నిర్మాణం పేరుతో అనుమతులు పొంది ప్రవేటు ఆసుపత్రిని నిర్వహిస్తుండడంతో చుట్టుపక్కల ఆవాసాలకు తీవ్రమైన వాసనలు వచ్చి రోగాల బారిన పడుతున్నారని పోలీసులకు, వైద్యాధికారికి, దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఏ శాఖ సైతం చర్యలు తీసుకోకపోవడంతో సిద్ధార్థ ప్రైమ్ స్కూల్ యజమాని గోగుల ప్రభాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో మా మీదనే కోర్టుకు వెళ్తావా అంటూ ఆసుపత్రి నిర్వాహకులు మట్ట మధుసూదన్ రెడ్డి తన ఇరువురు కూతుళ్లు డాక్టర్ సింధూర తోపాటు మరో డాక్టర్ కిరాయి గుండాలు శనివారం రాత్రి గోగుల ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వచ్చి భార్యాభర్తలను చితకబాదిన సంఘటన జరిగింది.

సిద్ధార్థ ప్రేమ్ స్కూల్ యజమాని గోగుల ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డులోని మున్సిపాలిటీ పార్కు వెనకాల ఇంటి అనుమతులు పొంది మట్ట మధుసూదన్ రెడ్డి అను వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు డాక్టర్ సింధూర తో పాటు ఆమె చెల్లెలు ప్రైవేట్ ఆస్పత్రిని అక్రమంగా నిర్వహిస్తుండడం వల్ల ఆసుపత్రి దుర్గంధం వ్యాపించి ఇంట్లో నివాసం ఉండలేని పరిస్థితి దాపురించిందని ఈ విషయాలపై మున్సిపాలిటీ కార్యాలయానికి, పోలీసులకు, జిల్లా వైద్యాధికారులకు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు.

గత నెల రోజుల క్రితం మా కుటుంబాన్ని హత్య చేసేందుకు మట్ట మధుసూదన్ కుటుంబం పథకం రచించిందని వారి వల్ల ప్రాణగండం ఉందని నర్సంపేట పోలీసులకు సైతం నాలుగు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని అన్నారు. ప్రత్యర్థులు పతక రచన చేసిన విధంగానే శనివారం రాత్రి సుమారు 10 నుండి 15 మంది సభ్యులు కర్రలు, కారంపొడి, ఇనుప రాడ్లతో విచ్చేసి మా భార్య భర్తలను విపరీతంగా గాయపరిచారని దాంతో ఇల్లంతా రక్తస్రావమైందని అంతేకాకుండా సీసీ కెమెరాలు సైతం పగలగొట్టారని, పూల కుండీలను, దర్వాజను తలుపులను ధ్వంసం చేశారని ప్రభాకర్ రెడ్డి కన్నీళ్ళ పర్యంతం చెందాడు.
వారి దాడి మూలంగా మా భార్య సృజన ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రభాకర్ రెడ్డి వాపోయాడు. ఇంటి నిర్మాణంతో అనుమతులు పొంది ఆసుపత్రి నిర్వహించడం వల్ల చుట్టుపక్కల నివాస కుటుంబాలకు తీరని ఆక్రందన నెలకొందని ఆయన వివరించారు. ఈ విషయంపై ఇన్నాళ్లు ఎవరు స్పందించకపోవడంతోనే మా కుటుంబాన్ని హత్య చేసే పథకం రచించారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ గోగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబంపై దాడి,హత్యా ప్రయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన

సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ గోగుల ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబంపై దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసిన వారిపై సమగ్ర విచారణ చేపట్టి నిoధుతులపై కట్టిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి గుర్రం అజయ్, ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, బి ఆర్ ఎస్ వి నర్సంపేట డివిజన్ ఇంచార్జి సదిరం వినయ్ మాట్లాడుతూ, గోగుల ప్రభాకర్ రెడ్డి ఇంటి వెనకాల మట్ట సింధూర రెడ్డి వారి కుటుంబం ఇంటి పర్మిషన్ అనుమతులు తీసుకొని ఆ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మిస్తుంది.
ఆ హాస్పిటల్ నిర్మించుకున్న పర్వాలేదు కానీ మా ఇంటికి ఇబ్బంది కలిగేలా మా ఇంట్లోకి ఏమి వాసన రాకుండా చూడండి అని అనేకమార్లు గోగుల ప్రభాకర్ రెడ్డి, మట్ట సింధూర రెడ్డి తో పాటు వారి నాన్న మట్ట మధుసూదన్ రెడ్డి కి మొదటి నుండి వారి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి వినిపించుకోకుండా గోగుల ప్రభాకర్ రెడ్డి ఇంటికి అనుకుని బాత్రూంలు నిర్మించారు, దీనివల్ల మా ఇంట్లోకి వాసన వస్తుందని చెప్పిన వినకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకపోవడంతో హైకోర్టులో కేసు వేయడం జరిగింది.
దీని జీర్ణించుకోలేని మట్ట మధుసూదన్ రెడ్డి, మట్ట సింధూర రెడ్డి మరి కొంతమంది దుండగులతో రాత్రి ఇంటి మీదికి వెళ్లి అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో మహిళలను తాకరాన్ని చోట తాకుతూ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులను సిసి కెమెరాలు పగలగొట్టి దాడి చేయడం జరిగింది, ఇట్లాంటి దాడులను విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని , ఇలాంటి దాడికి ఒడిగట్టినటువంటి వారిని పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మరల ఇలాంటి సంఘటనలు పృనారవృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశాల్ సాగర్ ప్రమోద్ కిరణ్ రవి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
