కరీంనగర్ రేకుర్తి లోని విజన్ హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ విచ్చేసి విద్యార్థులందరికీ నిత్య జీవితంలో సైన్స్ వలన ఉపయోగాలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారుచేసి పాఠశాల ప్రాంగణంలో వాటిని ప్రదర్శించి, వాటి యొక్క ఉపయోగాలు మరియు తయారు చేసే విధానం అందరికీ వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ సైన్స్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి,విద్యార్థిని, విద్యార్థులకు మరియు సైన్స్ ఉపాధ్యాయులకు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సందవేణి వెంకట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
