Saturday, February 28, 2026
HomeతెలంగాణMamunur Airport | మామునూరు విమానాశ్రయం ఏడాదిలో సిద్ధం..

Mamunur Airport | మామునూరు విమానాశ్రయం ఏడాదిలో సిద్ధం..

  • కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో డీపీఆర్..
  • త్వరలో ఆమోదం పొందే అవకాశం
  • 3 కిలోమీటర్ల మేర రన్‌వే విస్తరణ..
  • ఆధునిక టెర్మినల్, కార్గో సౌకర్యాల నిర్మాణం
  • విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి..
  • రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచే లక్ష్యం..

తెలంగాణలో విమానయాన రంగం విస్తరణకు మార్గం సుగమం అవుతోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి వాణిజ్య విమానాశ్రయంగా మార్చి, ఏడాదిలోగా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే దీనికి ఆమోదముద్ర లభించవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా వంటి సంస్థల పెద్ద విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్‌వేను 3 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో సదుపాయం, పటిష్ఠమైన భద్రతా వ్యవస్థలు, విశాలమైన పార్కింగ్ వంటివి నిర్మించనున్నారు.

- Advertisement -

ఈ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని కేటాయించగా, అదనంగా మరో 253 ఎకరాలను సేకరించి ఏఏఐకి అప్పగించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News