అనాథలను ఆదుకోవడంలోనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయడం అలవర్చుకోవాలని శ్రీ మహానంది జాతీయ పురస్కార గ్రహీత వకుళాభరణం భరత్ కుమార్ అన్నారు. జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శ ఓల్డేజ్ హోంలో తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిత్యవసరాల సామగ్రి పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ధర్మమార్గమే శాంతికి నిజస్వరూపమని తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించి ఆశ్రమానికి సుమారు రూ.40 వేల విలువ చేసే సామగ్రిని అందజేశారు.
ఆదర్శ ఓల్డేజ్ హోంలో వృద్ధులతో కలిసి గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.
