Thursday, February 26, 2026
HomeసినిమాMrithyunjay | ‘మృత్యుంజయ్’ మూవీ సాంగ్ ‘ఈ జిందగీ’ రిలీజ్

Mrithyunjay | ‘మృత్యుంజయ్’ మూవీ సాంగ్ ‘ఈ జిందగీ’ రిలీజ్

  • హీరో రామ్

ది కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని మార్చి 6న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్ అందరినీలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేయించారు. ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన రామ్.. టీంకి బెస్ట్ విషెస్‌ను అందించారు. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కాళ భైరవ అందించిన బాణీ, అభినవ కవి ర్యాప్ వెర్షన్ అద్భుతంగా ఉంది. ఇక అభినవ కవి, కృష్ణకాంత్ రాసిన సాహిత్యం అయితే జీవితం, అందులో ఎదురయ్యే సవాళ్ల గురించి ఎంతో గొప్పగా చాటి చెబుతోంది.

- Advertisement -

శ్రీ విష్ణు తన గ్యాంగ్‌తో కలిసి చేసే పనులు, వాళ్లకి ఎదురైన సవాళ్లు, వారి స్నేహ బంధం ఇలా అన్నీ రకాల ఎమోషన్స్‌ను చూపించేలా ఈ పాట సాగింది. ఇక ఆదిత్య అయ్యంగార్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ‘మృత్యుంజయ్’ మూవీని మార్చి 6, 2026న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ విష్ణు శైలిలో రూపొందిన ఈ థ్రిల్లర్ మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని టీం హామీ ఇస్తోంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా విద్యా సాగర్, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మనీషా ఎ. దత్ పని చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News