Thursday, February 26, 2026
HomeసినిమాVrushakarma | 'వృషకర్మ' మూవీ ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న రిలీజ్

Vrushakarma | ‘వృషకర్మ’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న రిలీజ్

తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో అద్భుతంగా సాగుతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్‌ ‘వృషకర్మ’ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, బాపినీడు ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. గ్లింప్స్ వృషకర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్నీక్ పీక్ ఇవ్వడానికి మార్చి 5న విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగ చైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుండి దూసుకు వస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తోంది. అతని కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ అద్భుతంగా వుంది. నడుముకు కట్టుకున్న క్లైంబింగ్ గేర్, చేతిలో ఉన్న తవ్వే ఆయుధం అతని పాత్ర ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిందో సూచిస్తున్నాయి. చుట్టూ ఉన్న రాళ్లు, తాళ్లు, అసమానమైన భూభాగం ఈ కథలో అడ్వెంచర్, థ్రిల్ స్థాయిని మరింత పెంచుతున్నాయి.

- Advertisement -

ఈ పాత్ర కోసం నాగ చైతన్య మ్యాసీవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు. రా, రగ్గడ్ లుక్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, అనేక థ్రిల్లింగ్ స్టంట్స్ ను స్వయంగా చేస్తున్నారు.

దర్శకుడు కార్తిక్ దండు తన బ్లాక్‌బస్టర్ డెబ్యూ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని, “వృషకర్మ”ను మరింత ఇమర్సివ్‌గా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, “లాపతా లేడీస్” ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

టెక్నికల్‌గా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. సినిమాటోగ్రఫీని రాహుల్ డి హెరియన్ నిర్వహిస్తుండగా, అజనీష్ బి లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల. నవీన్ నూలి ఎడిటర్,

తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రాగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -
RELATED ARTICLES

Latest News