- పార్టీ లో చేరికలు అంటూ.. ఆరాటపడుతున్నా మంత్రి సీతక్క
- కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారికి బీజేపీ కి పార్టీ కి ఎలాంటి సంబంధం లేదు
- భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత విమర్శ
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సి.ఎం రేవంత్ రెడ్డి మెప్పుకోసం మాత్రమే తెగ ఆరాట పడుతున్నారని, మంత్రులు, ముఖ్యమంత్రి దేవాదుల ప్రాజెక్టును ను మరోమారు సందర్శించడం వల్ల ఇక్కడి ప్రజల కు,రైతులకు ఒరిగేదేమీ లేదని, వచ్చే లాభము లేదని భాజపా ములుగుజిల్లా కిసాన్ మోర్చా నాయకులు డాక్టర్ జాడి రామరాజు నేత అన్నారు. ఆదివారం ఉదయం ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు.
దేవాదుల ప్రాజెక్టు లిప్ట్ ఇరిగేషన్ నుండి మైదాన ప్రాంతానికి నీళ్లు తరలించుకుపోవడానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసం మంత్రి సీతక్క ఇక్కడి బీజేపీ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ లో చేర్పించినట్టు చెప్పు కోవడం కోసం తెగ ఆరాట పడుతున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ గిరిజన మోర్చా అధ్యక్షులు గండేపల్లి సత్యం, ఈక మహాలక్ష్మి, రజిని గత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి తో ఉంటూనే ఇతర పార్టీ లకు మద్దతుగా ఉన్నందు వలనే బీజేపీ పార్టీ డిసెంబర్ 10 తేదీ రోజు నుండి బీజేపీ పార్టీ కార్యక్రమలకు రాకుండా అడ్డుకున్నామని ఆయన అన్నారు.
అదేవిదంగా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి రేవంత్ రెడ్డి పర్యటన లో భాగంగా బీజేపీ పార్టీ కి సంబంధంలేని వారికీ కండవలు కప్పి అడ్వా్టేజింగ్ చేసుకోవడం కోసం ఆరాటం చేస్తున్నదని అన్నారు. అదేవిదంగా మంత్రి కి అడ్వా్టేజింగ్ మీద ఉన్నా ద్రుష్టి ఏటూరునాగారం బస్సు డిపో పనులు పైన కానీ ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ఆమోదం పై లేదాని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పడం కాకుండా కొండాయి బ్రిడ్జి ఎలిశెట్టి పల్లిబ్రిడ్జి కoతనపల్లి చెరువు, ఐలపురం రోడ్డు అయ్యేవిదంగా చూస్తే బాగుంటదని అన్నారు.
అదేవిదంగా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్ లో చేర్పించుకోవడం కోసం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం సంక్షేమ పథకాలు ఇస్తామని పార్టీ లో చేర్పించుకునే నాయకురాలు నీకోసం ని గెలుపు కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉన్నాదా లేదా చెప్పాలని అన్నారు.
ఇప్పటికైనా భూములు ఇప్పిస్తాను అని చెప్పి ఒక్కరి ఒక్కరి దగ్గర 50వేల నుండి లక్షల వరకు వసూల్ చేస్తున్న నాయకులను పార్టీలకు చేర్చుకొని ప్రజలకు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఏమి సందేశం ఇస్తున్నాదో ములుగు నియోజకవర్గ ప్రజలు అర్ధం చేసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత ఈసందర్భంగా విమర్శించారు.
