Thursday, February 19, 2026
Homeవరంగల్‌Chennaraopet | భోజేరువు గుట్టపై భక్తి ఘంటాలు మోగిన వేళ

Chennaraopet | భోజేరువు గుట్టపై భక్తి ఘంటాలు మోగిన వేళ

  • ఐక్యతకు అద్దం పట్టిన మహోత్సవం..

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని భోజేరువు గ్రామ పరిధిలో ఉన్న గుట్టపై కొన్నేళ్ల క్రితం నిర్మితమైన Sri Venkateswara Swamy ఆలయం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలయంగా నిలిచింది.స్వామివారి ఆశీస్సులు గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని నమ్మే ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ వచ్చారు.

గ్రామంలో శ్రేయస్సు నెలకొనాలని,ప్రతి ఇంటిలో సంతోషం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహిళలు,పెద్దలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించి,ప్రత్యేక పూజలు చేశారు. “గోవిందా గోవిందా” నినాదాలతో గుట్ట మారుమోగగా,ఆ ప్రదేశం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడింది.

- Advertisement -

ఈ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్, ఉపసర్పంచ్ పెద్దబోయిన ఎల్లయ్య, పెద్ద గొల్ల వెంకన్న, సారీ గొల్ల రమేష్,మరియు ఆలయ కమిటీ సభ్యులు G రాజు,M రమేశ్,P కుమారస్వామి,దస్రు నాయక్,R బిక్షపతి, సాంబరాజు,p బిక్షపతి,బాలు,N రమేష్,బద్రు,ఐలయ్య, E రాజు ,A రమేష్,యాదగిరి వెంకన్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భోజేరువు గుట్టపై వెలిగిన ఈ భక్తి జ్యోతి గ్రామ ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం పూజల నిర్వహణ మాత్రమే కాదు – గ్రామ ప్రజల ఏకమత్యానికి, విశ్వాసానికి, సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవానికి నిలువెత్తు నిదర్శనం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News