- ఒలిశెట్టి రామకృష్ణ
- ప్రజల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యం : ఎస్‌హెచ్‌ఓ రామకృష్ణ
చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా ఒలిశెట్టి రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఆయన పోలీసు శాఖలో విశిష్ట అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పోలీసు సేవలను స్పెషల్ బ్రాంచ్‌లో ప్రారంభించిన రామకృష్ణ,అనంతరం కారఖానా పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు నిర్వహించారు.ఎస్‌బీ స్పెషల్ బ్రాంచ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన,తాజాగా బదిలీపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ రామకృష్ణ మాట్లాడుతూ,స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలు,అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి,నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ మరియు స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు,యువతలో అవగాహన కార్యక్రమాలు,సీసీ కెమెరాల వినియోగం పెంపు, రాత్రి పహారా వ్యవస్థను కట్టుదిట్టం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్‌ను అమలు చేసి,చిలకలగూడ ప్రాంతాన్ని శాంతియుతంగా,నేరరహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
