Wednesday, February 18, 2026
Homeరంగారెడ్డిJawahar Nagar | ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వేగం

Jawahar Nagar | ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వేగం

  • లబ్ధిదారుల నూతన గృహప్రవేశం ఘనంగా నిర్వహణ

జవహర్ నగర్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం అమలు వేగవంతంగా కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల సాకారం అవుతోంది.

ఈ సందర్భంగా జవహర్ నగర్ ఐదవ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులు ధనలక్ష్మి, చంద్రమౌళి దంపతులకు మంజూరైన నూతన గృహానికి గృహప్రవేశ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా పేదల జీవితాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

ప్రగతి పదం జనహితం మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం అనే నినాదంతో ప్రతి అర్హ కుటుంబానికి గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, ఇందిరమ్మ ఇండ్ల పథకం గరీబోళ్లకు వరంగా మారిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, రాజ్ కుమార్ గౌడ్, పలాస కిరణ్ కుమార్, వెంకటేష్ గౌడ్, రాజు యాదవ్, చింతల శ్రీనివాస్, గండి సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News