- 13 మంది ఐపీఎస్ అధికారుల ఎంపానెల్‌కు ఆమోదం..
- తెలంగాణ కేడర్ మహిళా అధికారిణి బీ. సుమతికి చోటు..
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..
భారత ప్రభుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నియామక కమిటీ కేంద్ర ప్రభుత్వంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ లేదా సమాన హోదా పోస్టులకు 13 మంది ఐపీఎస్ అధికారులను ఎంపానెల్‌లో చేర్చేందుకు ఆమోదం తెలిపింది.
2001 నుండి 2006 బ్యాచ్‌లకు చెందిన వివిధ రాష్ట్రాల కేడర్ అధికారులను “ఫస్ట్ రివ్యూ”, “సెకండ్ రివ్యూ” కింద ఎంపిక చేశారు. ఈ జాబితాలో తెలంగాణ కేడర్‌కు చెందిన 2006 బ్యాచ్ అధికారి బి. సుమతి కూడా ఉన్నారు.

ఎంపికైన అధికారుల్లో జార్ఖండ్, ఏజీఎంయూటి, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అసోం-మేఘాలయ తదితర కేడర్లకు చెందిన అధికారులు ఉన్నారు. ఈ జాబితా అధికారుల సీనియారిటీ క్రమంలో కాకుండా రూపొందించబడినదని ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జారీ చేశారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, శాఖలకు కాపీలు పంపించినట్లు అధికారులు తెలిపారు. కేంద్రంలో ఐజీ స్థాయి కీలక పోస్టులకు ఈ ఎంపానెల్ ద్వారా భవిష్యత్తులో నియామకాలు జరగనున్నాయి.
