Monday, February 16, 2026
Homeహైదరాబాద్‌Conference | ఓయూలో AIU సెంట్రల్ జోన్ వీసీల సదస్సు

Conference | ఓయూలో AIU సెంట్రల్ జోన్ వీసీల సదస్సు

  • ఏఐ & క్వాంటమ్ టెక్నాలజీపై జాతీయ స్థాయి మేధోమధనం
  • ఓయూకు రానున్న100కు పైగా వీసీలు

ఈ నెల 19, 20 తేదీల్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (AIU) మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల మీట్-2026 జరగనుందని ఉస్మానియా యూనివర్సిటీ బిసి ప్రొఫెసర్ కుమార్ ములుగురం వెల్లడించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు 100కు పైగా ఉపకులపతులు,విద్యావేత్తలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

క్రియేటింగ్ ఏఐ & క్వాంటమ్ టెక్నాలజీ ఆధారిత ఉన్నత విద్యాసంస్థల రూపకల్పన అంశంపై రెండు రోజుల పాటు మేధోమధనం జరగనుందన్నారు.సదస్సును ఓయూ ఛాన్సలర్,రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారన్నారు.సదస్సులో నైతిక పాలన,ఏఐ బాధ్యతాయుత వినియోగం,విద్యా సంస్కరణలు, విశ్వవిద్యాలయాల మధ్య సహకారం వంటి అంశాలపై మూడు సాంకేతిక సెషన్లు జరుగుతాయి.

- Advertisement -

చర్చల ఆధారంగా జాతీయ ఉన్నత విద్యా విధానానికి AIUకి కీలక సిఫార్సులు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.చీఫ్ ప్యాట్రన్‌గా ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం వ్యవహరిస్తుండగా,ప్యాట్రన్లుగా AIU అధ్యక్షులు ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్,సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిత్తల్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News