Monday, February 16, 2026
HomeతెలంగాణTJP | తెలంగాణ జాగృతిలోకి కావేటి వారసుడు..

TJP | తెలంగాణ జాగృతిలోకి కావేటి వారసుడు..

  • సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవితతో కలిసి మనోహర్ అడుగులు.. !

తెలంగాణ ఉద్యమ గడ్డపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కావేటి సమ్మయ్య రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కుమారుడు కావేటి మనోహర్ కుమార్, సోమవారం నాడు తెలంగాణ జాగృతి తీర్థం పుచ్చుకున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా మనోహర్ కుమార్‌కు కండువా కప్పి సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. మనోహర్ కుమార్ తో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, భారీ సంఖ్యలో ఆయన అనుచరవర్గం జాగృతిలో చేరి తమ మద్దతును ప్రకటించారు.

- Advertisement -

కవిత నాయకత్వమే శ్రీరామరక్ష: మనోహర్ కుమార్

ఈ సందర్భంగా కావేటి మనోహర్ కుమార్ భావోద్వేగంతో మాట్లాడుతూ, తన రాజకీయ ప్రయాణంలో ఇది కీలక మలుపని అభివర్ణించారు.
సామాజిక న్యాయమే ధ్యేయం అన్నారు.. “సామాజిక తెలంగాణ సాధన కోసం, అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తున్న కవిత పోరాట పటిమ నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆమె నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.”

“రాజకీయాల్లో సరికొత్త పంథాను అనుసరిస్తూ, యువతకు ప్రాధాన్యతనిస్తున్న కవితకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం.” “రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాగృతిని మరింత పటిష్టం చేసేందుకు, కవిత ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.”

అన్నారు.. కావేటి సమ్మయ్య లాంటి బలమైన నేత వారసుడు జాగృతిలో చేరడం, రాబోయే రోజుల్లో సంస్థకు మరిన్ని నూతన శక్తులను చేకూర్చడమే కాకుండా, తెలంగాణ రాజకీయ సామాజిక ముఖచిత్రంలో ఒక బలమైన మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News