- జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మూడు రోజుల్లో పాటు అంగరంగ వైభవంగా జరిగే ఏడుపాయల జాతరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొదటి రోజైన ఆదివారం కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు కలెక్టర్ దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతించి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. ప్రత్యేక పూజలు అనంతరం కలెక్టర్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ…
జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వనదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట దేవస్థానం ఈఓ వీరేశం, ఎండోమెంట్ అధికారి చంద్రశేఖర్ తో పాటు పలు శాఖల అధికారులు, దేవస్థానం సిబ్బంది తదితరులు ఉన్నారు.
