Friday, February 13, 2026
Homeనల్లగొండAlair | ఆలేరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్

Alair | ఆలేరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్ర రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో ఆలేరు మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకుని ఆధిక్యత సాధించింది. బీఆర్ఎస్ 3, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి.

వార్డుల వారీగా ఫలితాలు:

1వ వార్డు: కాంగ్రెస్ అభ్యర్థి చింతలపణి సునీత,పై బీఆర్ఎస్ అభ్యర్థి కోమల్ల మౌనిక హరీష్‌ 365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2వ వార్డు: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోతే కనకమ్మ పై
కాంగ్రెస్ అభ్యర్థి వానరాశి మరియమ్మ మార్క్, 477 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
3వ వార్డు: కాంగ్రెస్ అభ్యర్థి సందుల సురేష్,పై బి ఆర్ఎస్ అభ్యర్థి యాట శివ 52 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
4వ వార్డు: కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా శమంతా రెడ్డి,పై బీఆర్ఎస్ అభ్యర్థి బీజని కళ్యాణి మధు 46 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
5వ వార్డు: కాంగ్రెస్ అభ్యర్థి చింతకింది మురళిపై
బీజేపీ అభ్యర్థి పాషికంటి సంపత్, 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
6వ వార్డు: బిఆర్ఎస్ అభ్యర్థి రాయపురం శ్రీనివాస్ పై
కాంగ్రెస్ అభ్యర్థి అంగిడి ఆంజనేయులు, 449 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
7వ వార్డు: బి ఆర్ ఎస్ అభ్యర్థి బింగి లతా పై
కాంగ్రెస్ అభ్యర్థి బాలామణి భాస్కర్, 532 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
8వ వార్డు: బిఆర్ఎస్ అభ్యర్థి పాశికంటి శ్రీనివాస్ పై
బీజేపీ అభ్యర్థి బోట్ల సంపత్, కేవలం 3 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
9వ వార్డు: బిఆర్ఎస్ అభ్యర్థి కందుల బాబుపై
కాంగ్రెస్ అభ్యర్థి పస్తం ఆంజనేయులు, 474 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
10వ వార్డు: బిఆర్ఎస్ అభ్యర్థి పోరెడ్డి జయపై
కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల సరిత శ్రీకాంత్, 171 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
11వ వార్డు: బిఆర్ఎస్ అభ్యర్థి పంతం కృష్ణ పై
కాంగ్రెస్ అభ్యర్థి జుకంటి సంపత్, 32 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
12వ వార్డు: బిఆర్ఎస్ అభ్యర్థి మోర్తాల సునీత పై
కాంగ్రెస్ అభ్యర్థి జట్ట నీరజ సిద్దులు, 412 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.
ఈ ఫలితాలతో ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News