Wednesday, February 11, 2026
Homeబిజినెస్Bajaj Wego | ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..

Bajaj Wego | ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..

  • 296 కిలోమీటర్లు హ్యాపీగా జర్నీ చేయొచ్చు..
  • మరో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చిన బజాజ్ ఆటో సంస్థ..

ప్రముఖ వాహన సంస్థ బజాజ్‌ ఆటో మరో ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 17.7 కిలోవాట్లా బ్యాటరీతో తయారైన ఈ ఆటో సింగిల్‌ చార్జింగ్‌తో 296 కిలోమీటర్లు ప్రయాణించడం ప్రత్యేకత. ఈ-రిక్ష ప్రారంభ ధర రూ.4.41 లక్షలుగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ మొబిలిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో బజాజ్‌ ఆటో ఈ ‘వెగో పీ9018’ని మార్కెట్‌కు పరిచయం చేసింది.

ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఈ-ఆటోల్లో ఇదే అత్యధిక మైలేజీ ఇవ్వనున్నది. బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ చేసుకునే వీలుండే ఈ ఆటోలో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీతో సుదూర ప్రయాణాలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాహనంపై ఐదేండ్ల వ్యారెంటీ కల్పిస్తున్న ఈ వాహనం అర్బన్‌, సెమీ-అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు, సరుకు రవాణాకు సరిపోతుందని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ సమర్‌దీప్‌ సుబంధ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News