Wednesday, February 11, 2026
HomeతెలంగాణMunicipal Elections | మున్సి'పోల్' పరీక్ష..

Municipal Elections | మున్సి’పోల్’ పరీక్ష..

  • ఆసక్తిని రేపుతున్న త్రిముఖ పోరు..
  • రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు అగ్నిపరీక్ష
  • అస్తిత్వం కోసం గులాబీ ఆరాటం
  • మోడీ ఛరిష్మాతో బీజేపీ పోరాటం
  • హీటుమీదున్న రాజకీయ వాతావరణం
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై గెలుపు ప్రభావం

116 మునిసిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 52.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే కీలక మలుపుగా మున్సిపల్ ఎన్నికలు మారాయి. సాధారణ పట్టణ పాలన ఎన్నికలకే పరిమితమయ్యే పోరుగా కాకుండా, రానున్న అసెంబ్లీ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ‘సెమీఫైనల్’గా అన్ని పార్టీలు ఈ ఎన్నికలను చూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపా లిటీలు, 7 కార్పొరేషన్లకు నేడు పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

- Advertisement -

కాంగ్రెస్కు అగ్ని పరీక్ష :

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎదుర్కొం టున్న తొలి పెద్ద పట్టణ ఎన్నికలుగా ఇవి నిలిచాయి. అసెంబ్లీ విజయాన్ని ప్రజలు నిలబెట్టారా లేదా అన్నదానికి ఇది గట్టి పరీక్షగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మ కంగా మున్సి’పోల్’ పరీక్ష..
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ
రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే కీలక మలుపుగా మున్సిపల్ ఎన్నికలు మారాయి. సాధారణ పట్టణ పాలన ఎన్నికలకే పరిమితమయ్యే పోరుగా కాకుండా, రానున్న అసెంబ్లీ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ‘సెమీఫైనల్’గా అన్ని పార్టీలు ఈ ఎన్నికలను చూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపా లిటీలు, 7 కార్పొరేషన్లకు నేడు పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

కాంగ్రెస్కు అగ్ని పరీక్ష :

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎదుర్కొం టున్న తొలి పెద్ద పట్టణ ఎన్నికలుగా ఇవి నిలిచాయి. అసెంబ్లీ విజయాన్ని ప్రజలు నిలబెట్టారా లేదా అన్నదానికి ఇది గట్టి పరీక్షగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మ కంగా మంత్రులను పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జులుగా నియమించి విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామీణ పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన అనుకూలత పట్టణాల్లోనూ కొనసాగితే, కాంగ్రెస్కు ఇది బలమైన రాజకీయ భవిష్యత్తుగా మారనుంది.

బీఆర్ఎస్ కు అస్తిత్వ పోరాటం :

చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అన్నట్టుగా అసెంబ్లీ ఓటమి తర్వాత బలహీనపడిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు జీవన్మరణ పోరుగా మారాయి. గతంలో చేసిన మౌలిక వసతుల అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ముందుకు తెచ్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఫలితాలు ప్రతికూలంగా వస్తే పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ట్రంప్ కార్డు :

ఉచిత బస్సు ప్రయాణం, మహిళా ఆర్థిక భద్రత పథకాలు, విద్యుత్ సబ్సిడీలు వంటి ఆరు గ్యారెంటీలు పట్టణ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. అయితే రైతు భరోసా, రుణ మాఫీపై ఉన్న అనిశ్చితిని ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకు న్నాయి. ఈ పథకాలు నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయా అన్నదే కాంగ్రెస్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

బీజేపీ – మూడో శక్తిగా ఎదుగుతుందా? :

పార్లమెంట్ ఎన్నికల విజయాల ఊపుతో బీజేపీ పట్టణ ప్రాంతాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఆస్తి పన్నులు పెంచబోమన్న హామీ, అవినీతి రహిత పాలన నినాదంతో మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం రచించింది. ఉత్తర తెలంగాణ పట్టణాల్లో గణనీయమైన స్థానాలు సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర మరింత బలపడనుంది. మొత్తంగా, ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలనకే పరిమితం కావు, ఇవి తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు పునాది. విజయం సాధించిన పార్టీలు ధైర్యంగా ముందడుగు వేస్తే, వెనుకబడిన పార్టీలు తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News