Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Corporator | ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

Corporator | ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

  • కార్పొరేటర్ డా. సామల హేమ

సీతాఫలమండి డివిజన్ కార్పొరేటర్‌గా రెండోసారి ఎన్నికై నేటితో తన పదవీకాలం ముగిసిన సందర్భంగా కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మాట్లాడుతూ,ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సీతాఫలమండి డివిజన్ అభివృద్ధికి నిరంతరం అండగా నిలిచిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే తనను రెండుసార్లు నమ్మి గెలిపించిన సీతాఫలమండి డివిజన్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు,కార్యకర్తలు,అభిమానులు మరియు తన ప్రజాసేవను ప్రజల వరకు తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్పొరేటర్‌గా పదవీకాలం ముగిసినా ప్రజాసేవ మాత్రం నిరంతరం కొనసాగుతుందని,సీతాఫలమండి అభివృద్ధి,ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని స్పష్టం చేశారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News