Tuesday, February 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంబోడుప్పల్ సర్కిల్లో ఆడవాళ్లను అడ్డంపెట్టుకుని కోట్ల విలులైన భూమి కబ్జా..!

బోడుప్పల్ సర్కిల్లో ఆడవాళ్లను అడ్డంపెట్టుకుని కోట్ల విలులైన భూమి కబ్జా..!

  • బోడుప్పల్ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అనుమతి పొందినట్టు బోగస్ లేఅవుట్ మీద సంతకం చేసిన 14 ఏళ్ల బాలిక.
  • బోగస్ లే అవుట్ కు 1995 లోనే రెవెన్యూ పాసు బుక్కులు పొందిన లేడి.
  • సేల్ డీడ్ అసలే ఉండదు.. కానీ ఇంటి పర్మిషన్లు ఎలా పొందుతారు..?
  • రెవెన్యూ కార్యాలయంలో పాసుబుక్కులు రికార్డులలో ఎక్కడా లేవు : మేడిపల్లి ఎమ్మార్వో,
  • చెంగిచెర్ల లోని సర్వే నెంబర్ 9కి సంబంధించి ఎలాంటి సపరేట్ లేఔట్ లేదు : గత మున్సిపల్ కమిషనర్ బోడుప్పల్

జీ.హెచ్.ఎం.సి. బోడుప్పల్ సర్కిల్, చెంగిచెర్ల గ్రామంలోని సర్వేనెంబర్ 9 లో 150 ప్లాట్లను నకిలీ పత్రాలతో మింగేసిన భూ మాయగాడు. తెరమీద ఆడవాళ్ల పేరున నకిలీ డాకుమెంట్స్… కోట్ల విలువైన భూమి కబ్జాతో రోడ్డున పడ్డ 150 మంది ప్లాట్ యజమానులు. ఇంతకు తెర వెనుక చక్రం తిప్పుతున్న భూ కబ్జాకోరు ఎవరు..?

జీ.హెచ్.ఎం.సి. బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల గ్రామం సర్వేనెంబర్ 9లో దాదాపు 150 పేదల ప్లాట్లను కొల్లగొట్టిన లేడీ.. వివరాల్లోకి వెళితే… మేడ్చల్ నియోజకవర్గం ఒకనాటి బోడుప్పల్ గ్రామపంచాయతీ నేడు జిహెచ్ఎంసి లోని బోడుప్పల్ సర్కిల్… 1987 సంవత్సరంలోనే సూరమ్మ అనే వ్యక్తి నుండి ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వేనెంబర్ 8, 9లో సుమారు 16 ఎకరాల 20 గుంటల భూమి కొనుగోలు చేసి లేఅవుట్ వేసారు.

- Advertisement -

1987 నుండి 2000 సంవత్సరంలోపే 236 ప్లాట్లను వివిధ రకాల ఉద్యోగస్తులకు అమ్మి వేశారు.. నాటి నుండి నేటి వరకు ఎన్నో చేతులు మారుతూ వస్తున్నాయి. ఈ లే అవుట్ లోని కొంత భాగాన్ని ఆర్. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కబ్జా చేయగా, మరి కొంత భాగాన్ని ఓ లేడి పేరు మీద మరొకరు కబ్జా చేసినట్టు పరిస్థితులను బట్టి తెలుస్తుంది. వ్యవసాయ భూములలో ఉండే చిన్నచిన్న లొసుగులను ఆధారం చేసుకుని భూములను ఎలా కబ్జా చేయాలో వారసత్వంగా నేర్చుకున్న ఓ భూకబ్జాకోరు ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని కబ్జాకు తెరలేపడం జరిగిందనేది డాక్యుమెంట్లను పరిశీలిస్తే అర్థమవుతుంది.

1979 సంవత్సరంలోనే గ్రామపంచాయతీ పేరు మీద నకిలీ లేఅవుట్ :

1979 సంవత్సరంలో రుద్రమ్మ అనే వ్యక్తి సర్వేనెంబర్ 9లో 10 ఎకరాల భూమిని తేది 12-12-1979 సంవత్సరంలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్టు చూపిస్తున్నారు. ఆ అగ్రిమెంట్ చేసుకునే సమయానికి రుద్రమ్మకు కేవలం 14 సంవత్సరాల వయస్సు మాత్రమే. ఇదే సంవత్సరంలో అంటే తేదీ -27-12-1979 సంవత్సరంలోనే బోడుప్పల్ గ్రామపంచాయతీ నుండి లేఔట్ అనుమతి పొందినట్టు చూపిస్తున్నారు.

ఈ లేఔట్ పై రుద్రమ్మ ఆంగ్లభాషలోనే సంతకం కూడా చేశారు. 14 ఏళ్ల చిన్న వయసులోనే వ్యాపారం కూడా మొదలుపెట్టారా..? విచిత్రం ఏమిటంటే… బోడుప్పల్ మున్సిపల్ వారు సర్వేనెంబర్ 9కి ఎలాంటి సపరేట్ లేఔట్ అనుమతి లేదని ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చారు. మరి ఈ లేఔట్ వీరికి ఎవరు ఇచ్చినట్టు..? ఇంతకీ బోగస్ లేఔట్ ఎవరు తయారు చేసినట్టు..? తెర వెనుక అసలు కబ్జాకోరు ఎవరు? ఇదొక్కటే …

రెసిడెన్షియల్ (లే అవుట్) నుండి వ్యవసాయ భూమిగా ఎలా మార్పు జరిగింది..?

1979 వ సంవత్సరంలోనే నోటరీ అగ్రిమెంట్ నుండి అదే సంవత్సరం, అదే నెలలో వ్యవసాయ భూమి నుండి రెసిడెన్షియల్ భూమిగా మారి ప్లాట్లుగా విభజించారు. తిరిగి వ్యవసాయ భూమిగా మారి 1995 సంవత్సరంలో రైతువారి పాసుబుక్కులు పొందారు. ఇట్టి రైతు వారి పాసుబుక్కులు, వాటికి సంబందించిన ఖాతా నెంబరు వివరాలు రెవెన్యూ రికార్డులలో కనిపించకపోవడం మరీ విచిత్రంగా ఉంది.
-వ్యవసాయ భూమిగా మారాక ఇంటి పర్మిషన్లు ఎలా ఇస్తారు?

రెసిడెన్షియల్ లే అవుట్ నుండి 1995 సంవత్సరంలో వ్యవసాయ భూమిగా మార్చుకున్న రుద్రమ్మకు 2006 సంవత్సరంలో చెంగిచెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి రెండు ఇంటి పర్మిషన్లు తీసుకోవడం ఎలా సాధ్యమైంది.? పర్మిషన్లు తీసుకున్న రెండు ప్లాట్ నెంబర్లు మరో వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండడం గమనించదగ్గ విషయం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఒకరి పేరు మీద ఉండగా… ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేని రుద్రమ్మ పేరు మీద ఇంటి పర్మిషన్లు ఎలా ఇచ్చారనేది మిలియన్ డాలర్ ప్రశ్న గా మారింది.

పాసుబుక్కులు పొందడం కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికేనా..?

అవును ముమ్మాటికీ నిజమని డాక్యుమెంట్లను పరిశీలిస్తే తెలుస్తుంది.. రుద్రమ్మ పేరు మీద ఉన్న స్టాంప్ పేపర్లను చూస్తేనే సవాలక్ష అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటి స్టాంప్ పేపర్ల మీద 1979వ సంవత్సరం డిసెంబర్ లోనే అగ్రిమెంట్ తీసుకున్నట్టు నోటరీ చేయించారు. కేవలం 15 లేఔట్ పర్మిషన్ రోజుల్లోనే బోడుప్పల్ గ్రామపంచాయతీ నుండి పొందినట్టు చూపించారు. తిరిగి 1995 సంవత్సరంలో పాస్ బుక్స్ పొందినట్లు చూపించారు.

ఈ పాస్ బుక్స్ తోనే 2002, 2005 సంవత్సరములలో ముగ్గురు వ్యక్తుల పేర్ల మీద 10 ఎకరాల వ్యవసాయ భూమిని జిపిఏ తీసుకున్నారు. ఇందులోని మూడో వ్యక్తి తన వాటాను మిగతా ఇద్దరికీ రిజిస్ట్రేషన్ చేశాడు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇద్దరు వ్యక్తులకు ఇప్పటివరకు రెవెన్యూ రికార్డులలో ఎలాంటి మ్యూటేషన్ జరగలేదు. ప్రస్తుతం ఈ 10 ఎకరాల భూమికి హక్కుదారులుగా చలామణి అవుతూ.. అసలైన 150 మంది ప్లాట్ ఓనర్లను నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేశారు.

ఇలా ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసి సునాయాసంగా కొట్టేసానని మురిసిపోతున్నాడు షాడో భూ కబ్జాకోర్… – బోడుప్పల్ గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 9కు ఎలాంటి సపరేట్ లేఔట్ లేదు. ఆర్ టి 60 సమాచారం ద్వారా బాధితులకు తెలియజేసిన… గత బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్..

రుద్రమ్మ అనే మహిళ 1995వ సంవత్సరంలో రైతు వారి పాసుబుక్కులు పొందినట్టు, ఘట్కేసర్, మేడిపల్లికి చెందిన రెవెన్యూ రికార్డులలో ఈ పాసుబుక్కులకు సంబంధించిన విషయాలు లేకపోవడం వలన పలు అనుమానాలకు దారితీస్తున్నాయని చెప్పుకొచ్చారు. రుద్రమ్మ కు సంబంధించిన పాస్ బుక్స్ తమ రికార్డులలో ఎక్కడా లభ్యం కాలేదు. :

మేడిపల్లి రెవెన్యూ అధికారి భూ కబ్జాకోర్ పై హెచ్ఎండిఏ ఆదేశాల మేరకు బోడుప్పల్ మున్సిపల్ కమీషనర్ తీసుకున్న నిర్ణయం, తదుపరి పరిణామాలలో హెచ్ఎండీఏ అధికారులు లంచగొండు బాగోతంతో భూకబ్జాకోర్ విచారణలో దొరికిపోతారా..! అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేనా చూడాల్సిందే…

- Advertisement -
RELATED ARTICLES

Latest News