- కాంగ్రెస్, ఎం.ఐ.ఎం. కలిసి ముస్లింలను రెచ్చగొడుతున్నారు..
- ప్రజలమధ్య చిచ్చుబెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు..
- ఇప్పుడు కాంగ్రెస్తో, మొన్నటిదాకా బీ.ఆర్.ఎస్.తో మజ్లిస్ దోస్తీ..
- అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మార్చింది బీఆర్ఎస్- కాంగ్రెస్లో
- నిర్మల్ జిల్లా కార్నర్ మీటింగ్లో రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు..
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతూ, సమాజంలో విభేదాలు, విధ్వంసానికి కారణమవుతున్నాయి. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యం అన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్రావు.. సోమవారం రోజు ఆయన నిర్మల్ జిల్లా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో మజ్లిస్ పార్టీ కాపురం చేస్తోంది. గతంలో ఇదే మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ఈ కాపురం చేసింది. ప్రజాసమస్యలు, అభివృద్ధిపై వారికి ధ్యాసలేదు.
కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోంది. ఈ మూడు పార్టీలు అంతర్గతంగా కుమ్మక్కై పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఈ మూడు పార్టీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు.. ప్రజలు తమ భవిష్యత్తు కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, దేశ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. బిజెపిని గెలిపించడం అంటే తెలంగాణను రక్షించడం, దేశాన్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం.
తెలంగాణలో మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో నిజమైన అభివృద్ధి కావాలంటే బిజెపి గెలవాల్సిందే. అభివృద్ధికి ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే. మున్సిపాలిటీల్లో రోడ్ల నిర్మాణం, పేదలకు 5 కిలోల ఉచిత రేషన్, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి వంటి అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నాయి. బిజెపి అధికారంలో ఉంటేనే అవినీతిరహిత పాలన అందుతుంది. నిర్మల్ ప్రజల సమస్యలను పరిష్కరించి, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అందుకే నిర్మల్లో బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, మున్సిపల్ చైర్మన్ గా గెలిపించాలని కోరుతున్నాను.

సేవ్ తెలంగాణ -ఓట్ ఫర్ బిజెపి.
ఈ నినాదం ఎందుకంటే ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలే. రాష్ట్రంలో కుటుంబ పాలన కారణంగా తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. రైతులకు రైతుబంధు లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు ఇతర విశ్వవిద్యాలయాల్లో సరిపడా ప్రొఫెసర్లు లేరు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు.
ఇవన్నీ బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలన వైఫల్యాలే అన్నారు.. గతంలో ప్రజలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. తరువాత కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. కానీ ఈ రెండు పార్టీలు తెలంగాణను దోచుకుని, ప్రజలను మోసం చేశాయి. అందుకే ఇప్పుడు సుపరిపాలన అందించే బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అవినీతిరహిత నగర పాలన, సమగ్ర అభివృద్ధి కావాలంటే నిర్మల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను.
