Monday, February 9, 2026
HomeజాతీయంRafale | రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం

Rafale | రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం

  • ఆపరేషన్ సింధూర సమయంలో సత్తా చాటిన రఫెల్స్..
  • ఈనెల చివర్లో పచ్చజెండా ఊపేందుకు అవకాశం..
  • ఈ డీల్ ఓకే అయితే భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగులుతుంది..

భారత్, ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల చివర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ పర్యటన ముందు డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ దీనికి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతగా ఉన్న డీఏసీ రాబోయే రోజుల్లో సమావేశం కానుంది. రక్షణ కార్యదర్శి నేతృత్వంలోని రక్షణ సేకరణ బోర్డు గత నెలలో ఇప్పటికే రాఫెల్ కనుగోలు ప్రతిపాదనను ఆమోదించింది.

ఈ రాఫెల్ డీల్ ఓకే అయితే, భారత్ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణల్లో ఒకటిగా మిగులుతుంది. దీని విలువ సుమారుగా రూ. 3.25 లక్షల కోట్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రమైన స్వాడ్రన్ల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ డీల్ కుదిరితే భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుంది. పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్ కు 42 స్వాడ్రన్ల యుద్ధ విమానాలు కావాలి, కానీ ప్రస్తుతం 29 మాత్రమే ఉన్నాయి.

- Advertisement -

ఈ డీల్ లో 18 విమానాలను ఫ్లై అవే స్టేటస్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంది, మిగిలిన వాటిని భారత్ లో తయారు చేస్తారు. దాదాపు 80 శాతం విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్ వర్క్ కింద స్వదేశీ కంటెంట్ 60 శాతానికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, 88 సింగిల్ సీట్, 26-ట్విన్ సీట్ వేరియంట్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేర్చుకుంటుంది.

డస్సాల్ట్ ఏవియేషన్ స్థానిక తయారీ కోసం, భారతీయ ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చు కుంది. రాఫెల్ జెట్లలో అధునాతన రాడార్స్, సెన్సార్లు ఉన్నాయి. ఇవి లాంగ్ రేంజ్ దాడి సామర్థ్యాన్ని కల్పిస్తాయి. మెటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణుల్ని రాఫెల్స్ తో అనుసంధానించవచ్చు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ సామర్థ్యం ప్రత్యక్షంగా చూశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News