- వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ముఖ్య నాయకులు
- మద్దతుగా ముఖ్య నేతల నేతల ప్రచారం
మొయినాబాద్ మున్సిపాలిటీ అజీజ్ నగర్ లో గల మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఘనంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి పామేన భీమ్ భరత్, అనిత హరినాథ్ రెడ్డి, ఫహీం పాల్గొన్నారు.
నేతలు ఇంటింటి ప్రచారం చేసి, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం–అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. చెయ్యి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, టీపీసీసీ కార్యదర్శులు రామ్ రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గణేష్ గౌడ్, కిరణ్, బాలకృష్ణ రెడ్డి, కృష్ణ రెడ్డి, వెంకటేష్, బర్ల యాదయ్య, సుభాష్ చంద్రబోస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
