Friday, June 12, 2026
Homeనల్లగొండBJP Leaders | అవకాశం ఇవ్వండి.ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం..

BJP Leaders | అవకాశం ఇవ్వండి.ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం..

ఆలేరు మున్సిపాలిటీలోని 3వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని 3వ వార్డు బిజెపి అభ్యర్థి చిలుగురి శాంతి రెడ్డి అన్నారు శనివారం వార్డులో ఇంటింటా తిరుగుతూ కమలం పువ్వు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే వార్డులో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించి పారిశుద్ధ్య లోపం లేకుండా చూస్తానని ఓటర్లకు మాటిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో అలీ సందీప్, ఎలాగందుల సురేష్, బబ్బులు, పెరపు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News