- సపర్యలు చేసి రక్షించిన బాటసారులు!
ములుగు జిల్లా మంగపేట మండలంలో ని కమలాపురం – ఏటూరునాగారం రాష్ట్రీయ రహదారిపై జీడివాగు వద్ద గురువారం రాత్రి ఓ వన్యప్రాణి (లేడి) ని రమనక్కపేట నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీ ఒకటి ఢీ కొట్టి వెళ్లిపోయిన ఘటన లో సదరు జింక తీవ్ర అస్వస్థతకు గురైoది.ఈ ప్రమాదం ను గమనించిన వరంగల్ నుండి కమలాపురానికి బైక్ పై వస్తున్న యువకుడు చిరుత రంజిత్, మరి కొందరు బాటసారులు గాయపడిన దుప్పి స్పృహ తప్పి రోడ్డుపై పడిపోగా దానికి తాగిన సపర్యలు చేశారు.కోలుకున్న అనంతరం దానికి ఎలాంటి హాని కలుగకుండా,ఎవరి కంటా పడకుండా అడవిలో కి వదిలిపెట్టి తమ బాధ్యత ను సరిగా నిర్వర్తించారు.
- Advertisement -
