Homeనల్లగొండAlair | మీ బిడ్డగా అడుగుతున్నా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

Alair | మీ బిడ్డగా అడుగుతున్నా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

  • ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.

ఆలేరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రెండో రోజు కూడా జోరుగా సాగింది.ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గడపగడపకు తిరుగుతూ ప్రజలను కలుసుకొని ఓటును అభ్యర్థించారు. ఆలేరు మున్సిపాలిటీలో మొత్తం 12 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని తెలిపారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ప్రధానంగా రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ సాగుకు అవసరమైన ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామని మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టి వారి దైనందిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ గృహ వ్యయాన్ని తగ్గిస్తున్నామన్నారు.

- Advertisement -
Alair MLA Beerla Ilaiah Leads Congress Municipal Election Campaign

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతమన్నారు. విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం చేస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందని అన్నారు. అలాగే దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

మున్సిపాలిటీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని అన్నారు…ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈసారపు యాదగిరిగౌడ్,టౌన్ అధ్యక్షులు ఏజాజ్, నాయకులు మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు, కట్టే కొమ్మల సాగర్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,మాజీ ఎంపీపీ గందమళ్ళ అశోక్, కానుగు బాలరాజు గౌడ్, దూడల రాజశేఖర్ గౌడ్, పర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -
RELATED ARTICLES

Latest News