Friday, May 1, 2026
Homeకెరీర్ న్యూస్Jobs | విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు..

Jobs | విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు..

  • గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
  • తెలంగాణ ఓవర్సేస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా అవకాశం..

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త అందించింది. ఈ సంస్థ మార్గదర్శకత్వంలో రష్యా దేశంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పైప్ స్ట్రెయిటెనింగ్ ఆపరేటర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టామ్ కామ్ అధికారులు వెల్లడించారు. విదేశాల్లో ఉపాధి ఆశించే నైపుణ్యవంతులకు ఇది కీలక అవకాశంగా మారింది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రూబుల్స్ జీతం చెల్లించనున్నారు. ఇది ఇండియన్ కరెన్సీలో సుమారు 72,000 రూపాయలకు సమానం. రష్యాలోని పరిశ్రమల్లో పని చేసే అవకాశం ఉండటంతో పాటు, స్థిరమైన ఆదాయం లభించేలా ఈ ఉద్యోగం రూపొందించారు. జీతంతో పాటు పని అనుభవం పెరగడం, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News