Homeఅంతర్జాతీయంLibya | గడాఫీ కుమారుడు హతం..

Libya | గడాఫీ కుమారుడు హతం..

  • కాల్చి చంపిన దుడగులు..
  • ఇటీవలే బయటకు వచ్చిన సయిఫ్ ఆల్..

లిబియా మాజీ నియంత ముఅమ్మర్ గడాఫీ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ముఖ్యంగా గడాఫీ పతనం తర్వాత ఆ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించిన ఆయన కుమారుడు.. 53 ఏళ్ల సయిఫ్‌ అల్‌ ఇస్లాం గడాఫీని పలువురు దుండగులు కాల్చి చంపారు. నేరుగా జింటాన్‌ నగరంలో ఉన్న ఆయన ఇంట్లోకి చొరబడి మరీ.. గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ ఆయనను కాల్చి చంపారు.

2011 నాటి ప్రజా విప్లవం తర్వాత పదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఇటీవలే బయటకు వచ్చి రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా ఎదగాలనుకున్న ఈ సమయంలోనే హత్యకు గురికావడం సంచలనంగా మారింది. జింటాన్‌లోని సయిఫ్‌ అల్‌ ఇస్లాం నివాసంపై అత్యంత ప్రణాళిక బద్ధంగా ఈ దాడి జరిగింది. ముఖ్యంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు ముసుగు వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.

- Advertisement -

వెంటనే అక్కడి సీసీటీవీ కెమెరాలను పగులగొట్టేశారు. అనంతరం లోపలికి వెళ్లి సయిఫ్‌ అల్‌ ఇస్లాంను తుపాకులతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని ఆయన ఫ్రెంచ్ న్యాయవాది మార్సెల్ సెకాల్డి, ఆయన రాజకీయ సలహాదారు అబ్దుల్లా ఉస్మాన్ అబ్దుల్ రహీంలు అధికారికంగా ధృవీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News