Friday, February 27, 2026
HomeసినిమాMega Star Chiranjeevi | ఈ ఆనందానికి అవధుల్లేవు

Mega Star Chiranjeevi | ఈ ఆనందానికి అవధుల్లేవు

  • మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు కవలలు – ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో అపూర్వమైన ఆనందం నెలకొంది. ఈ ప్రసవం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఈ శుభవార్త చిరంజీవి కుటుంబంలో రెట్టింపు వేడుకలని తీసుకొచ్చింది. 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..’అందరికీ నమస్కారం. మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంటి జరిగిన ఈ శుభవార్త మీతో పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటు కొణిదెల ఫ్యామిలీ అటు కామినేని ఫ్యామిలీ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము. 

- Advertisement -

మా ఇంట ఈ మంచి జరగాలని మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. భగవంతుడి దయవల్ల, హనుమాన్ కృప వలన ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఇది మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మమ్మల్ని అభిమానించే వారికి మా మంచి కోరుకునే వారికి ఈ వార్తని పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. 

ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అపోలో వైద్యులకు, వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అభిమానులు అందరూ కూడా ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంది. నేను ఎంత చెప్పినా సరే ఈ ఆనందానికి అవధులు లేవు. అందరికీ థాంక్యు’

జూన్ 20, 2023న రామ్ చరణ్–ఉపాసన దంపతులు తమ తొలి సంతానంగా కుమార్తె క్లింకారకు జన్మనిచ్చారు. ఇప్పుడు, కవలల రాకతో, కొణిదెల, కామినేని కుటుంబాలలో ఆనందం రెట్టింపు అయింది. అభిమానులు, శ్రేయోభిలాషులందరిలోనూ పండగ వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News