Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిKapra | కాప్రా మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు.

Kapra | కాప్రా మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు.

  • ప్రభుత్వ భూములు కాపాడటమే దెయమ్.
  • కాప్రా.తాసిల్దార్, బైరెడ్డి రాజేష్

కాప్రా మండల పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడే దిశగా రెవెన్యూ శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కాప్రా మండల్ పరిధి జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు. సర్వే నెంబర్లు. 205, 364, 497, 695, 696 లలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు.

ఈ మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రమేష్, సత్యనారాయణతో పాటు రెవెన్యూ సిబ్బంది జెసిబి వాహన సహకారంతో ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ స్పష్టం చేశారు.

- Advertisement -

ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల విషయంలో దళారుల మాటలు నమ్మి ప్రజలు భూములు కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు సూచించారు. ప్రభుత్వ భూముల్లో మళ్లీ అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. భూకబ్జాలకు పాల్పడాలని ఆలోచించే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ప్రజల తరఫున వినతులు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News