Tuesday, February 10, 2026
Homeవరంగల్‌Narsampet | మేడారం జాతర వేళ నర్సంపేటలో వాహనాల రద్దీ

Narsampet | మేడారం జాతర వేళ నర్సంపేటలో వాహనాల రద్దీ

దారులన్నీ మేడారం వైపే నర్సంపేట నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భారీగా తరలుతున్న భక్తులు వాహనాలు ట్రాఫిక్ జామ్ లో నర్సంపేట

ములుగు జిల్లా తాడ్వాయి సమ్మక్క సారక్క మండలంలో మేడారం వనదేవతల జాతరకు నర్సంపేట మీదుగా భారీ వాహనాలు తరలి వెళ్తున్నాయి బుధవారం పౌర్ణమి కావడంతో సాయంత్రం నాలుగు గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చు కార్యక్రమం గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెలకు వచ్చి భక్తులు ఆశీర్వదించే కార్యక్రమం ఉన్నందున భక్తులు తండోపతండాలుగా వనదేవతల ఆశీర్వాదం కోసం వనం బాట పట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా వివిధ వాహనాల ద్వారా భక్తులు తరలి వెళుతుండగా వీరికి తోడు ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట తొర్రూరు తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు కార్లు ట్రాక్టర్లు ట్రాలీ గూడ్స్ వాహనాలలో భక్తులు అశేషంగా నర్సంపేట మీదుగా వెళుతుండడంతో నర్సంపేట పట్టణం అంబేద్కర్ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది.

హైవే 365 ద్వారా నర్సంపేట మీదుగా మీదుగా ములుగు జిల్లా మల్లంపల్లి కి చేరుకొని ములుగు జంగాలపల్లి గోవిందరావుపేట పస్రా మీదుగా నార్లాపూర్ చేరుకొని అక్కడి నుండి కొత్తూరు కన్నెపల్లి గ్రామాల నుండి జంపన్న వాళ్ల చేరుకొని ఆ పరిసర ప్రాంతాల్లో వెహికల్ పార్కింగ్ చేసి సమ్మక్క తల్లి వద్దకు నడక దాడిన చేరుకునే అవకాశం పోలీసులు ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలు విధించారు. దీంతో భక్తులు ఉత్సాహంగా ఉల్లాసంగా అత్యంత భక్తి భావంతో కోళ్లు మేకపోతులతో కేరింతలకొడుతూ బయలుదేరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News