Thursday, March 26, 2026
Homeఆదిలాబాద్BRS Party | ఆసిఫాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలు

BRS Party | ఆసిఫాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలు

ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

ఆసిఫాబాద్ నియోజకవర్గం(Asifabad Constituency)లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లోకి వలసల జోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Mla Kova Lakshmi) నాయకత్వంపై నమ్మకంతో, ఆమె చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై MRPS, కాంగ్రెస్ పార్టీల నాయకులు, మహిళా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ​1వ వార్డుకి చెందిన MRPS జిల్లా నాయకులు ఇప్ప నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా కార్యకర్తలు పార్టీలో చేరారు. ​జన్కపూర్, ఎస్.సి కాలనీకి చెందిన ముఖ్య నాయకులు, కుల సంఘ పెద్దలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారు. వారికి ​ఎమ్మెల్యే స్వయంగా గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, గుండి సర్పంచ్ జాబరి రవీందర్, BRS నాయకురాలు మర్సకోల సరస్వతి, పొన్నాల నారాయణ, దూడల అశోక్, గంధం శ్రీను, నిస్సార్, భీమేష్, భీమయ్య రాజయ్య, సుధాకర్, అశోక్, పందిర్ల సాలమ్మ, చంద్రకళ, చిన్నక్క, మురళి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News