Monday, April 13, 2026
Homeనిజామాబాద్‌Armoor Mla | దుబాయ్‌లో మోసం.. బాధితుడికి సాయం..

Armoor Mla | దుబాయ్‌లో మోసం.. బాధితుడికి సాయం..

ఉపాధి(Employment) కోసం పొట్ట చేతబట్టుకొని ఇతర దేశానికి వెళ్లి మోసపోయిన ఓ వ్యక్తికి బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) సాయం చేశారు. గుత్ప గ్రామానికి చెందిన గుమ్ముల నవీన్(S/O నరేందర్) కొద్ది రోజుల కిందట దుబాయ్ (Dubai) వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఈ విషయాన్ని ఆలూర్ మండల బీజేపీ ప్రెసిడెంట్ సూర శ్రీకాంత్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ఎంబసీ అధికారుల(Embassy Officials)తో మాట్లాడి బాధితుణ్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. పైడి రాకేష్ రెడ్డి ఆదుకోవటం పట్ల నవీన్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News