- మేడిబావిలో అభివృద్ధి పర్యటన చేపట్టిన కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ
మేడిబావి డివిజన్ పరిధిలోని మేడిబావి,బీదల బస్తీ,వీరయ్య గల్లి ప్రాంతాల్లో కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం పర్యటించారు.ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సహకారంతో డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా స్థానిక సమస్యలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు.ఈ నెలలోనే ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారి చేతుల మీదుగా సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు స్థానిక ప్రజలకు కార్పొరేటర్ తెలిపారు.
సుమారు కోటి రూపాయల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు.అలాగే వర్షాకాలంలో ఏర్పడే నీటి నిల్వలు,రోడ్ల దెబ్బతినే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే తమ లక్ష్యమని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ అన్నారు.
