77వ గణతంత్ర దినోత్సవం వేడుకలను సోమవారం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు.స్కూల్ ప్రిన్సిపాల్ ఓ.సత్యనాథ్ జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం విద్యార్థిని విద్యార్థులతో జాతీయ గీతాలాపన,రాష్ట్ర గీతాలపన చేశారు.అనంతరం విద్యార్థులు వీధి వీధినా తిరుగుతూ స్లోగన్ తో పరేడ్ నిర్వహించి,దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభ,పి.కృష్ణ,ఎన్.సైదులు, చిట్టిబాబు,రఫీ,ప్రతాప్,వర్గీస్, మౌళి,సబిత,మునీర తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
