Tuesday, February 10, 2026
HomeతెలంగాణKishan Reddy | కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ ప్రభుత్వం

Kishan Reddy | కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ ప్రభుత్వం

  • తెలంగాణను ఇంకెంత దోచుకుంటారు…?
  • అన్ని జిల్లాల్లో బీజెపి పోటీచేస్తుంది
  • కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
  • ఆగమైపోయిన తెలంగాణను బాగు చేసుకుందాం
  • విలేకర్ల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి.

రానున్న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారతీయ జనతాపార్టీపోటీ చేస్తుందని కేంద్రభగ్గు గనుల శాఖామంత్రి జి. కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం జరిగిన విలేకర్ల సమావే శంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల కోసం బీజెపి సిద్ధంగా ఉందని ప్రజలు ఆదరించాలని అన్నారు. ఎన్నో పోరాటాలు కొట్లాటలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణరాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రలు, ఎంపిలు అందిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు.

ఇప్పుడు కేసిఆర్ కుటుంబం దోచుకున్న సొమ్మును పంచుకోవడంలో కొట్లాటలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఏవిధంగా పాలన చేశారో చూసి విసుగు చెందిన ప్రజలు మార్పు కావాలని కోరుకోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆపార్టీ కూడా కేసీఆర్ పాలనలానే దోచుకోవడానికి సిద్ధపడిందని ఆరోపించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేక పోయిందని గ్యారెంటీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆగమైపోయిన తెలంగాణను బాగు చేసుకుందామని, ఇకనైనా ప్రజలు మేలుకోవాలని రానున్న ఎన్నికల్లో బీజెపి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.

- Advertisement -

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఖైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కెవి.రంగాకిరణ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మాచినేని ధర్మారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు జివికె మనోహర్రావు, భద్రాద్రి జిల్లా సంస్థాగత ఇన్చార్జీ విజయ చందర్రెడ్డి, జిల్లా ఎలక్షన్ కోకన్వీనర్ ముకుందరెడ్డి, కొత్తగూడెం ఎలక్షన్ కన్వీనర్ గొడుగు శ్రీధర్ యాదవ్, కో కన్వీనర్ బానోతు రవినాయక్, మాడ కృష్ణారెడ్డి, పట్టణాధ్యక్షుడు శీలం విద్యాసాగర్, పాల్వంచ మండల అధ్యక్షుడు రాపాక రమేష్, సుజాతనగర్ మండలాధ్యక్షుడు వెంకన్నయాదవ్, సీనియర్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News