Friday, March 6, 2026
Homeరంగారెడ్డిCPI | గుడిసె వాసులకి మౌలిక వసతులు కల్పించాలి

CPI | గుడిసె వాసులకి మౌలిక వసతులు కల్పించాలి

  • సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్ర చారీ
  • సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడడ్డి

దేశ పౌరులందరికి మౌలిక వసతులని పాలకులే కల్పించాలనే రాంజ్యంగా సూత్రానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కుంట్లూరు భూదాన భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలందరికీ కనీసమైన మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి మరియు ముత్యాల యాది రెడ్డి అన్నారు.

రావి నారాయణరెడ్డి ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని మూడేళ్లు పూర్తి అయి నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భూ పోరాట కేంద్రంలో సిపిఐ అబ్దుల్లాపూర్మెట్ మండల సమితి ఆధ్వర్యంలో మండల కార్యదర్శి అజ్మీర హరిసింగ్ నాయక్ అధ్యక్షతన శనివారం నాడు భారీ బహిరంగ సభ ని నిర్వహించారు.ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళ్లు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పినట్లు భూమిలేని నిరుపేదలకి భూమి మరియు ఉండటానికి నివాసం లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని అన్నారు.ఇల్లు లేని నిరుపేదలు మాత్రమే ఇక్కడ గుడిసెలు వేసుకున్నారని. వారికి కరెంటు, నీళ్లు, కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పేదలు అనేక మంది ఉంటున్నారని, వాళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సుమారు వంద ఎకరాల భూదాన భూమిని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూస్వా

- Advertisement -
RELATED ARTICLES

Latest News