రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Deputy CM Mallu Bhattivikramarka) చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర(People’s March Paadayatra)లో ఇచ్చిన హామీ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపెల్లి తారమ్మకి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ ఇంటిని భట్టివిక్రమార్క బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం తనకెంతో ఆనందం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. హామీలను కార్యరూపంలోకి తీసుకొస్తూ రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. పనుల పురోగతిని బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులను జమచేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రకటించారు. ఇప్పటికే రూ.150 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.
Indiramma Illu | తారమ్మ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
