- జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ,
- 5 వ వార్డు నుండి బీజేపీలోకి భారీగా చేరికలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలతో బిజెపిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని జిల్లా అధ్యక్షులు నారాయణ అన్నారు. ఆదివారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డు నుంచి జ్యోతి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది ఎస్టీ యువతీ యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారనీ అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
