- మాజీ డిప్యూటీ మేయర్
చెన్నాపురం దేవేందర్ నగర్ లోని వడ్డెర ఓబన్న విగ్రహానికి మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ రెడ్డి శెట్టి మహేష్ నర్ర మహేష్.రాము. శ్రీనివాస్. కన్న, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓబన్న సేవలను గుర్తు చేస్తూ సమాజ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు.పార్టీ కార్యకర్తలు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.
- Advertisement -
