Tuesday, March 3, 2026
Homeక్రైమ్ వార్తలుCBI Raids | సీపీఆర్ఐ జేడీ ఇంట్లో నోట్ల గుట్టలు

CBI Raids | సీపీఆర్ఐ జేడీ ఇంట్లో నోట్ల గుట్టలు

రాజారామ్ మోహన్‌రావ్ చెన్ను అరెస్ట్

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిపిన తనిఖీల్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. లంచం కేసు(Bribe Case)లో సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(Central Power Research Institute-CPRI) జాయింట్ డైరెక్టర్(Joint Director) రాజారామ్ మోహన్‌రావ్ చెన్ను(Rajaram Mohanrao Chennu)ను అరెస్ట్ చేశారు. రూ.9.5 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టగా రూ.3.59 కోట్ల లెక్కల్లో లేని నగదు లభించినట్లు చెప్పారు. ఇందులో దాదాపు రూ.4 లక్షల విలువైన విదేశీ నగదు(Foreign Currency)(యూఎస్ డాలర్లు, హాంకాంగ్ డాలర్లు, సింగపూర్ డాలర్లు, ఇండోనేషియన్ రూపియా, మలేషియా రింగిట్, యూరోలు, యుయాన్లు, స్వీడిష్ క్రోనా, యూఏఈ దిర్హం) కూడా ఉన్నట్లు తెలిపారు. సుధీర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే ప్రైవేట్ సంస్థ ఉత్పత్తి చేసిన విద్యుత్ పరికరాలకు సంబంధించి అనుకూలమైన నివేదికలను జారీచేయడానికి చెన్ను అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, లంచాలు తీసుకుంటున్నాడని ఆరోపణలు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News