Wednesday, February 11, 2026
HomeఫోటోలుNivetha Pethuraj | జూబ్లీహిల్స్‌లో వి‌కేర్ సీఓఈ ప్రారంభం

Nivetha Pethuraj | జూబ్లీహిల్స్‌లో వి‌కేర్ సీఓఈ ప్రారంభం

మన దేశంలో అడ్వాన్స్‌డ్ స్కిన్ & ఎస్తేటిక్ కేర్(Advanced Skin & Aesthetic Care) రంగంలో ప్రముఖ సంస్థ అయిన వి‌కేర్(VCare).. హైదరాబాద్‌లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)ను ఘనంగా ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యక్తిగత స్కిన్ కేర్ సేవలను ఇండియాలో అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

సినీ నటి నివేతా పెతురాజ్ మాట్లాడుతూ.. ‘వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్కిన్‌కి కావాల్సిన అని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. నేను నా గ్లామర్(Glamour) విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. షుగర్ అసలు తీసుకోను. అలాగే.. ఫ్యాట్ ఫుడ్ కూడా ఏమీ తీసుకొను. నాకు చేపల ఫులుసు అంటే చాలా ఇష్టం’ అని చెప్పారు.

- Advertisement -

చెన్నైలో సీఓఈ విజయవంతమైన అనంతరం హైదరాబాద్‌లో ప్రారంభించిన వి‌కేర్.. త్వరలో బెంగళూరులో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించనుంది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో అత్యాధునిక ఎస్తేటిక్ సేవలను విస్తరించడమే వి‌కేర్ లక్ష్యం.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, హెల్త్‌కేర్ నిపుణులు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. దీన్నిబట్టి.. మెడికల్ ఆధారిత నైతిక ఎస్తేటిక్ చికిత్సలపై పెరుగుతున్న ఆసక్తిని తెలియజేశారు.

వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Center of Excellence) ప్రత్యేక ఆకర్షణగా మన దేశంలోనే తొలి సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్‌ను పరిచయం చేసింది. ఒక రోజు చికిత్సా విధానం, 7 అత్యాధునిక లేజర్ టెక్నాలజీలను త్రీ-డైమెన్షనల్ స్కిన్ ఆర్కిటెక్చర్ విధానంలో సమన్వయం చేస్తుంది. మొదటి రోజు నుంచే స్పష్టమైన ఫలితాలు, తదుపరి 90 రోజుల పాటు క్రమంగా మెరుగైన స్కిన్ టెక్స్చర్, గ్లో అందిస్తుంది.

వి‌కేర్ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ ఇ.కరోలిన్ ప్రభా. మన దేశంలో తొలి మహిళా ట్రైకాలజిస్ట్‌గా గుర్తింపు పొందారు. 80కు పైగా క్లినిక్స్‌తో వి‌కేర్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. సీఈఓ ముకుందన్ సత్యనారాయణన్.. ట్రైకాలజీ, కాస్మెటిక్ సైన్సెస్, న్యూట్రాస్యూటికల్స్, వెల్‌నెస్ రంగాల్లో 22 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. పరిశోధన ఆధారిత ఆధునిక చికిత్సలను సంప్రదాయ వైద్య విజ్ఞానంతో సమన్వయం చేస్తున్నారు.

ఈ సందర్భంగా వి‌కేర్ సీఈఓ ముకుందన్ సత్యనారాయణన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఎస్తేటిక్ ప్రమాణాలు వేగంగా మారుతున్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా.. చర్మాన్ని పైచికిత్సలకే పరిమితం చేయకుండా బహుళ స్థాయిల్లో సమగ్రంగా పరిష్కరించే విధానాన్ని అందిస్తున్నాం’ అని తెలిపారు.

వి‌కేర్ వ్యవస్థాపకుడు ఇ.కరోలిన్ ప్రభారెడ్డి మాట్లాడుతూ.. ‘మేం ప్రవేశపెట్టే ప్రతి టెక్నాలజీ గ్లోబల్ క్లినికల్ వాలిడేషన్, FDA క్లియరెన్స్, నిరూపిత ఫలితాల ఆధారంగా ఎంపిక చేయబడింది’ అని అన్నారు.

వరల్డ్-క్లాస్ ఎస్తేటిక్ టెక్నాలజీలు

వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అందుబాటులో ఉన్న ప్రధాన అంతర్జాతీయ టెక్నాలజీలు:

ISEMECO 3D D9 AI స్కిన్ అనలైజర్–ఇండియా తొలి AI ఆధారిత 3D స్కిన్ అనాలిసిస్, K-Excellence స్కిన్ అనలైజర్(కొరియా), డెర్మోస్కాన్ DSM-4 కలరిమీటర్(జర్మనీ), ఇన్‌మోడ్ ట్రిటాన్ ప్లాట్‌ఫామ్, ఆల్మా హార్మనీ XL PRO, జీసిస్ డెన్సిటీ RF, లుట్రానిక్ హాలీవుడ్ స్పెక్ట్రా లేజర్ & జీసిస్ అల్ట్రాసెల్ Q+(HIFU), ఎనర్జెట్ నీడిల్-ఫ్రీ ట్రాన్స్‌డెర్మల్ సిస్టమ్

ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో వి‌కేర్ ఇండియాని గ్లోబల్ ఎస్తేటిక్ రంగంలో మరింత బలంగా నిలబెడుతూ, ఇంటెలిజెంట్, కస్టమైజ్డ్, ఫలితాలపై ఆధారిత స్కిన్ ఆర్కిటెక్చర్‌కు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది. వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. ఆధునిక అందానికి భవిష్యత్ దిశ.

- Advertisement -
RELATED ARTICLES

Latest News