ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate-ED) కలకత్తా హైకోర్టు(Calcutta High Court)ను ఆశ్రయించింది. ఐప్యాక్ కార్యాలయం(I-Pac Office)లో, ఆ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ డైరెక్టర్ ప్రతిక్ జైన్(Pratik Jain) ఇంటిలో తనిఖీలకు పశ్చిమ బెంగాల్ సీఎం(West Bengal CM) మమతా బెనర్జీ(Mamata Banerjee) అడ్డుపడ్డారని పిటిషన్‌లో ఆరోపించింది. కీలకమైన ఆధారాలను ఆమె తీసుకెళ్లారని ఫిర్యాదు చేసింది. మమతా బెనర్జీ రాకముందు తమ సోదాలు ప్రశాంతంగా, ప్రొఫెషనల్‌గా జరిగాయని, ఆమె వచ్చి ఆటంకపరిచారని ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎంగా మమతా బెనర్జీ తన రాజ్యాంగాధికారాన్ని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. ప్రతిక్ జైన్.. టీఎంసీ పార్టీ ఐటీ సెల్ హెడ్ కూడా కావటం గమనార్హం. మమతా బెనర్జీ పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులతో కలిసి వచ్చి డాక్యుమెంట్లను, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పట్టుకెళ్లారని, వాటిలో కీలక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఐప్యాక్ రిజిస్టర్డ్ సంస్థ అయిన ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. బొగ్గు అక్రమ రవాణాతో సంబంధం ఉన్న హవాలా ఆపరేటర్.. ఇండియన్ PAC కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రూ.10 కోట్ల లావాదేవీలు చేశాడని పేర్కొంది.
I-Pac Raids | కలకత్తా హైకోర్టుకు ఈడీ
- Advertisement -
RELATED ARTICLES
