కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒడియారంలోని జడ్పిహెచ్ఎస్లో విద్యార్థులు(ZPHS Students) గ్రామ సభ నిర్వహించారు. తరగతి గదుల(Class Rooms)ను ప్రజాస్వామ్యానికి వేదిక(Platform for Democracy)గా మార్చారు. సర్పంచ్(Sarpanch), డిప్యూటీ సర్పంచ్, వార్డు సభ్యుల(Ward Members) సమక్షంలో విద్యార్థుల నేతృత్వంలో గ్రామ సభ జరిగింది. సామాజిక శాస్త్ర అభ్యాసంలో భాగంగా ప్రతి వార్డు నుంచి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో స్థానిక సమస్యలను ప్రస్తావించారు. స్థానిక సమస్యలపై స్పష్టత, అవగాహనకు వారు ప్రశంసలు అందుకున్నారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్.. విద్యార్థులకు గ్రామ పంచాయతీ పనితీరుపై అవగాహన కలిగించింది. పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడంపై అర్థవంతమైన చర్చలకు దారితీసింది. ఏప్రిల్లో విద్యా వాహిని-బడి బాటాను నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.
Gram Sabha | ప్రభుత్వ బడిలో విద్యార్థుల గ్రామ సభ
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
