హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో అర్హత లేని వైద్యుడు(Unqualified Practitioner) నిర్వహిస్తున్న నకిలీ క్లినిక్(Quack’s Clinic)ను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA) తనిఖీ చేసింది. డ్రగ్ లైసెన్స్(Drug Licence) లేకుండా నిల్వ చేసిన యాంటీబయాటిక్స్(Antibiotics), స్టెరాయిడ్స్(Steroids) సహా 30 రకాల మందులను స్వాధీనం చేసుకుంది. అలాంటి ఔషధాల అక్రమ అమ్మకం యాంటీమైక్రోబయల్ నిరోధకత సహా తీవ్ర ప్రజారోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని హెచ్చరించింది. విశ్లేషణ కోసం నమూనాలను సేకరించింది. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. లైసెన్స్ లేని సంస్థలకు మందులు సరఫరా చేసే టోకు వ్యాపారులు కూడా చర్యలు ఎదుర్కొంటారని చెప్పారు. అక్రమ మందుల కార్యకలాపాలపై సమాచారం ఇచ్చేందుకు 1800-599-6969 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
