Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిWelfare | కుష్టు వ్యాధి బాధిత కుటుంబాలకు సహాయం

Welfare | కుష్టు వ్యాధి బాధిత కుటుంబాలకు సహాయం

గ్రేటర్ హైదరాబాద్ కాప్రా మండల పరిధిలోని జవహర్ నగర్ మథర్ థెరిస్సా కాలనీలో బుధవారం కుష్టు వ్యాధి బాధిత కుటుంబాలకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సహాయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధి బాధితులు, వితంతువులు, వృద్ధులు కలిపి మొత్తం యాభై కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మహిళలకు చీరలు, పురుషులకు చొక్కాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సహాయ కార్యక్రమాన్ని గ్రేస్ సేవా సంఘం, ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు బిషన్ యం జాకోబ్, సమన్వయకర్త ఎం ఎల్ ప్రసాద్, కుష్టు వ్యాధి బాధితుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్, ఉపాధ్యక్షురాలు కె అనసూయ సహకారంతో ఈ కార్యక్రమం సాగింది.

- Advertisement -

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ బస్తీ వైద్యశాల వైద్యురాలు రిసిక, మథర్ థెరిస్సా కాలనీ అధ్యక్షుడు బూడిద వెంకటేష్, వైద్యుడు డియాష్, సామాజిక సేవకురాలు మామిడి మంజుల, ఎం రవి హాజరయ్యారు. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బూడిద వెంకటేష్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి బాధితులు, వృద్ధులు, వితంతువులను గుర్తించి తీవ్రమైన చలి కాలంలో అవసరమైన సహాయం అందించిన సేవా సంస్థలకు కాలనీ వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News