Wednesday, February 11, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐRidhima Pathak | తప్పించలేదు.. తప్పుకున్నా..

Ridhima Pathak | తప్పించలేదు.. తప్పుకున్నా..

తనను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(Bangladesh Premier League) ప్రజెంటర్(Presenter) పోస్ట్ నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలను ఇండియా(India)కి చెందిన రిధిమా పాఠక్(Ridhima Pathak) ఖండించారు. తానే స్వచ్ఛందంగా వైదొలిగానని స్పష్టం చేశారు. ఇది తాను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. తనకు దేశమే ముఖ్యమని, దేశం తర్వాతే ఏదైనా అని ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. భవిష్యత్తులోనూ క్రికెట్‌కి సేవ (Service to Cricket) చేస్తానని తెలిపారు. ఇన్నాళ్లూ తనకు సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. రిధిమా పాఠక్‌ను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హోస్టింగ్ ప్యానల్ నుంచి తీసేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ జీవో జారీ చేసిందంటూ వార్తలు రావటంతో ఆమె స్పందించారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య కొన్నాళ్లుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ దేశంలో హిందువులపై దాడులు జరుగుతుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News