పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) సైట్ వద్ద అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రులు(Ministers) నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్ తదితర ప్రజాప్రతినిధులు, జల వనరుల శాఖ ఉన్నతాధికారులు(Officers), ఇంజనీర్లు(Engineers) పాల్గొన్నారు. ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయని(Civil Works Complete), గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పారు. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్(Action Plan) రూపొందించుకొని పనిచేయాలన్న అన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కుడి కాలువ ద్వారా కొల్లేరు(Kolleru) ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు వేయాలని చంద్రబాబు అన్నారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని సీఎం వెల్లడించారు.
Polavaram | పోలవరంపై చంద్రబాబు సమీక్ష
- Advertisement -
RELATED ARTICLES
