Friday, April 3, 2026
Homeమెదక్‌Sarpanch | సమయానికి రావాల్సిందే

Sarpanch | సమయానికి రావాల్సిందే

ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే కుదరదు
పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ వార్నింగ్
ఆయనపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన సెక్రెటరీ

జగదేవపూర్, జనవరి 5(ఆదాబ్ హైదరాబాద్): ‘సమయానికి రావాల్సిందే. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా అంటే కుదరదు. గతంలో వేరు. ఇప్పుడు వేరు’ అని ఓ గ్రామ సర్పంచ్.. సంబంధిత పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary)కి వార్నింగ్(Warning) ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఐదేళ్లుగా మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా ఎవరూ పట్టించుకునేవారులేరు. కానీ ఇప్పుడు అడగటానికి నేనున్నా. గ్రామ ప్రజలు నాపై నమ్మకంతో నేను వారికి సేవ చేస్తానని భావించి నన్ను సర్పంచ్‌(Sarpanch)గా ఎన్నుకున్నారు. గ్రామ ప్రజలకు సేవ చేయడానికే నేనున్నా. నిబంధనల(Rules) ప్రకారం సమయానికి వచ్చి సమయానికి వెళ్లాలి’ అని ఆయన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే.. దీనిపై పంచాయతీ కార్యదర్శి.. ఎంపీడీవోకు ఫిర్యాదు(Complaint to MPDO) చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ తన తీరు మార్చుకుంటారా? లైట్ తీసుకుంటారా? అనేది వేచి చూడాలని గ్రామ ప్రజలు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News