Friday, February 13, 2026
Homeకెరీర్ న్యూస్Free Training | ఉద్యోగ హామీతో ఉచిత నైపుణ్య శిక్షణ

Free Training | ఉద్యోగ హామీతో ఉచిత నైపుణ్య శిక్షణ

జనగాం జిల్లా కలెక్టర్(Jangaon District Collector) రిజ్వాన్ బాషా షేక్(Rizwan Basha Shaik).. నిరుద్యోగ యువతకు ఉద్యోగ హామీ(Job Guarantee for Youth)తో ఉచిత నైపుణ్య శిక్షణ(Free Skill Training) కార్యక్రమాన్ని ప్రకటించారు. దీన్ని లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్(LSC), రెడింగ్టన్ ఫౌండేషన్(COLTE) సహకారంతో నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా 100% ప్లేస్‌మెంట్‌తో పరిశ్రమ ఆధారిత లాజిస్టిక్స్ శిక్షణను అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు సుమారు రూ.13,000–రూ.18,000 నెలవారీ వేతనంతో ఉద్యోగాలు ఇస్తారు. శిక్షణ పూర్తిగా ఉచితం. ఆహారం, వసతి కల్పిస్తారు. స్కిల్ ఇండియా సర్టిఫికెట్ వస్తుంది.

- Advertisement -

📌 కలెక్టరేట్‌లో జరిగిన డ్రైవ్‌లో 40 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు
📌 జనవరి 2026 నుండి ప్రారంభమయ్యే శిక్షణా కోర్సులు
📌 వయస్సు అర్హత: 19–28 సంవత్సరాలు | కుటుంబ ఆదాయం: సంవత్సరానికి ₹3 లక్షల కంటే తక్కువ

అందించే కోర్సులు:

  • రియల్ టైమ్ ఫోర్క్‌లిఫ్ట్ ఆపరేటర్-38 రోజులు(10వ/12వ తరగతి)
  • సప్లై చైన్ అసోసియేట్-53 రోజులు(12వ తరగతి)
  • ఎగుమతి, దిగుమతి ఎగ్జిక్యూటివ్-73 రోజులు(గ్రాడ్యుయేట్)

📍 శిక్షణ స్థానం: నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(National Skill Training Institute), విద్యా నగర్, హైదరాబాద్

నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను సంపాదించుకుని తక్షణ ఉపాధిని పొందాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News